Logo
Download our app
పారిశుధ్య కార్మికురాలి మృతి
NEWS   Mar 28,2025 02:11 pm
మల్యాల జీపీలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మ్యాక దేవమ్మ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందింది. గత 15రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవమ్మ మరణించడంతో మల్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవమ్మ దాదాపు 20 సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారని, కరోనా కష్టసమయంలో సేవలందించిన ఆమె మృతి జీపీకి తీరని లోటని ఈవో శ్రీకాంత్ అన్నారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source