ముమ్మాటికీ కేసీఆర్ తెలంగాణ జాతిపిత
NEWS Mar 28,2025 10:02 am
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముమ్మాటికీ ఎవరు కాదన్నా ఔనన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ హయాంలోనే తెలంగాణకు గుర్తింపు లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అబద్దాలు, మోసాలు, దౌర్జన్యాలు, కేసులు, ఆత్మహత్యలు తప్ప ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు చెప్పినట్లు మీరు ఎన్ని తిట్టినా తెలంగాణ కోసం భరిస్తామని చెప్పారు. మంత్రులు , సీఎం దూషించినా అవి తమకు దీవెనలని అనుకుంటామని అన్నారు కేటీఆర్. కానీ కేసులకు, జైళ్లకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలు పూర్తి ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.