కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయం
NEWS Mar 28,2025 09:12 am
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ కటుంబం మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఉగ్ర రూపం దాల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్లు ఫ్రాడ్ చేసినట్లుగా నివేదికలున్నాయని, త్వరలోనే జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్ర వీగిన కేసీఆర్ ను బండ కేసి కొట్టారని అన్నారు. అందుకే కామారెడ్డిలో అడ్రస్ లేకుండా చేశారని ధ్వజమెత్తారు.