నికోలస్ పూరన్ ధనాధన్
NEWS Mar 28,2025 08:31 am
జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు లఖ్ నవూ జట్టు ప్లేయర్ నికోలస్ పూరన్. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 191 పరుగుల లక్ష్యాన్ని సునాయసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ పరంగా శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తే బ్యాటింగ్ పరంగా పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నికోలస్ పూరన్ కేవలం 26 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్ల మోత మోగించాడు. 70 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 52 పరుగులు చేశాడు. ఎప్పటి లాగే కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. అనవసర షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఎక్కడా తగ్గలేదు ఎల్ ఎస్ జీ.