చెలరేగిన లఖ్‌నవూ తలవంచిన హైదరాబాద్
NEWS Mar 28,2025 08:13 am
ఐపీఎల్ 2025లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ దెబ్బకు విల విల లాడింది. తమకు ఎదురే లేదని విర్రవీగుతూ వచ్చిన ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు ఆటగాళ్లు. తుక్కు రేగ్గొట్టారు. ప్రధానంగా నికోలస్ పూరన్ విధ్వంసానికి తేలి పోయారు హైదరాబాద్ బౌలర్లు. ఉతికి ఆరేశాడు. మైదానం నలుమూలలా షాట్స్ తో విరుచుకు పడ్డాడు. ఫోర్లు , సిక్సర్లతో రెచ్చి పోయాడు. దీంతో ఓటమి తప్పలేదు ఎస్ఆర్ హెచ్ కు. 5 వికెట్ల తేడాతో ఓడించింది. తమకు ఎదురే లేదని చాటింది ఎల్ ఎస్ జె. ముందు బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.