పాస్టర్ ప్రవీణ్ ది రోడ్డు ప్రమాదం కాదు
NEWS Mar 27,2025 06:52 pm
ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కాదని హత్యేనని సంచలన ఆరోపణలు చేశారు. ఇది హత్య అని కోర్టులో రుజువు చేస్తానని ప్రకటించారు. రాజమండ్రి ఎస్పీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. పోలీసులు అన్నీ అబద్దాలే చెబుతున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిలే ప్రసక్తి లేదన్నారు.