Logo
Download our app
పోల‌వ‌రం ఎప్పుడో పూర్తి కావాలి
NEWS   Mar 27,2025 03:25 pm
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేదన్నారు. గతప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. తాము వ‌చ్చాక తిరిగి ప్రాజెక్టుపై పూర్తిగా ఫోక‌స్ పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు సీఎం. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఖర్చు భారీగా పెరిగి పోయిందన్నారు. 2014-2019 మధ్య 33 సార్లు ప్రాజెక్ట్ సందర్శించానని చెప్పారు. గత సీఎం ఐదేళ్లలో ఒక్కసారైనా కనిపించారా అని ప్ర‌శ్నించారు. పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేశారని ప్ర‌శంసించారు. గతంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామ‌ని తెలిపారు చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source