Logo
Download our app
టీడీపీ హైక‌మాండ్ పై ఎమ్మెల్యే గుస్సా
NEWS   Mar 27,2025 01:26 pm
తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస్ వ్య‌వ‌హారం. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. త‌న గురించి పార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లాన‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించారు. త‌న‌ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా.. తేదీ, సమయం చెప్పండి అని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source