Logo
Download our app
ప్ర‌వీణ్ ప‌గ‌డాల మృతి బాధాక‌రం
NEWS   Mar 27,2025 12:53 pm
పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ విమలా రెడ్డి. తన బిడ్డలకు ఎవరైనా హాని కలిగిస్తే ఆ దేవుడు క్షమించడని అన్నారు. ఆయ‌న ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేశార‌ని, ఎవ‌రికి ఇబ్బంది క‌లిగినా వారికి సాయం చేశార‌ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ భౌతికంగా లేక పోవ‌డం, రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డం త‌న‌ను క‌లచి వేసింద‌న్నారు. ఇది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని అంటున్నార‌ని, దీనిపై స‌మగ్ర విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎంత మందికి వీలైతే అంత సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌వీణ్ ప‌గ‌డాల విష‌యంలో న్యాయం జ‌రిగేలా చూడాల‌ని స‌ర్కార్ ను డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source