Logo
Download our app
క‌లెక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు దిశా నిర్దేశం
NEWS   Mar 27,2025 10:24 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల స్థాయిలోనే ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు మీరు ఉన్నార‌ని గుర్తించాల‌న్నారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. అక్క‌డ ప‌రిష్కారం కాక పోతే సీఎంఓ చూస్తుంద‌న్నారు. అంతిమంగా ఏ సమస్య అయినా పరిష్కారం కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. కాగా త‌న జీవితంలో చాలాసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని క‌లిశాన‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం దేనికైనా సిద్ద‌మ‌న్నారు. సూప‌ర్ 6 కోసం కొంత అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source