ఉపాధ్యాయురాలు ఆకస్మిక మరణం
NEWS Mar 26,2025 11:51 pm
మల్యాల కేంద్రంలోని స్థానిక వాగ్దేవి పాఠశాలలో ప్రైవేట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాధ (44) బుధవారం ఆకస్మిక మరణం చెందారు. వివరాల ప్రకారం.. అనురాధ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తుండగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలింది. దీంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించినట్లు సమాచారం.