చైనా కంపెనీ హైద్రాబాద్ లో కార్ల తయారీ
NEWS Mar 26,2025 05:01 pm
తెలంగాణలో ప్రముఖ చైనా కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దిగ్గజ సంస్థ బీవైడీ హైదరాబాద్ సమీపంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమను స్థాపించనుంది . దేశంలో ఈ కంపెనీ స్థాపించబోయే తొలి ప్లాంట్ తెలంగాణలోనే కావడం విశేషం. ఈ కంపెనీ ఏర్పాటు అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం ప్రకటించింది.