Logo
Download our app
ఓటుకు నోటు దొంగ అని అన‌లేమా..?
NEWS   Mar 26,2025 03:36 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి నోరు జారారు. ఓటుకు నోటు దొంగ అని తాము అన‌లేమా అని అన్నారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా అని అన్నారు. 20 శాతం క‌మీష‌న్లు అని జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పిన మాట‌ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ముందు మీ పార్టీ ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకున్నాక త‌మ గురించి మాట్లాడాలంటూ మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source