పాస్టర్ మరణంపై విచారణకు ఆదేశం
NEWS Mar 26,2025 02:35 pm
పాస్టర్ ప్రవీన్ పగడాల మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై స్పందించారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ కు ఫోన్ చేశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలన్నారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ మంత్రికి తెలిపారు.