Logo
Download our app
కొడాలి నాని ఆరోగ్యం ప‌దిలం
NEWS   Mar 26,2025 12:19 pm
మాజీ మంత్రి కొడాలి నానికి గుండె పోటు వ‌చ్చిందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసి వైసీపీ. ఈ మేర‌కు ఆ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శ‌శి భూష‌ణ్ స్పందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని తెలిపారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది ప‌డ్డార‌ని అన్నారు. అందుకోస‌మే ఆస్ప‌త్రిలో చేరార‌ని చెప్పారు. ఆయ‌న‌కు సాధార‌ణ ప‌రీక్ష‌లు చేశార‌ని, అంతా స‌వ్యంగానే ఉంద‌ని వైద్యులు తెలిపార‌ని పేర్కొన్నారు. గుండె పోటు వచ్చినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమ‌న్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఎవ్వరు ఆందోళన చెందవ‌ద్ద‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source