Logo
Download our app
చెల‌రేగిన అయ్య‌ర్ మెరిసిన శ‌శాంక్
NEWS   Mar 25,2025 09:47 pm
ఐపీఎల్ 2025 లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ భారీ స్కోర్ సాధించింది. 5 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 243 ర‌న్స్ చేసింది. స్కిప్ప‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 97 ర‌న్స్ తో చెల‌రేగి పోయాడు. 42 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్స‌ర్లు కొట్టాడు. యంగ్ర క్రికెట‌ర్ శ‌శాంక్ దుమ్ము రేపాడు. 44 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 16 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ యంగ్ క్రికెట‌ర్ ఆఖ‌రి 20వ ఓవ‌ర్ లో ఏకంగా 5 ఫోర్లు బాదాడు. గుజరాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియం ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ద‌ద్ద‌రిల్లి పోయింది.
⚠️ You are not allowed to copy content or view source