కావాలని వార్నర్ ను కామెంట్ చేయలేదు
NEWS Mar 25,2025 05:25 pm
క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై నోరు జారారు నటుడు రాజేంద్ర ప్రసాద్. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. తాను కావాలని క్రికెటర్ గురించి అనలేదన్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా తాను చేసిన కామెంట్స్ కలకలం రేపడంతో తాను ఇవాళ క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తాను ఉద్దేశ పూర్వకంగా అనలేదని, సరదాకే అన్నానని చెప్పారు. ఇకపై ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనంటూ ప్రకటించారు.