మద్యాన్ని అలవాటు చేసింది బీఆర్ఎస్సే
NEWS Mar 25,2025 01:32 pm
అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలకు మద్యం అలవాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ ఆరోపించారు. మద్యానికి బానిస అయ్యేలా చేసి, పన్నులతో ఆదాయాన్ని పెంచేలా చేశారని అన్నారు. తమ ప్రజా పాలనలో ఒక్క శాతం కూడా పన్నులు పెంచలేదన్నారు మంత్రి. అన్ని వ్యవస్థలను ఆనాడు నాశనం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తాను ఇప్పటి వరకు మచ్చ లేని నాయకుడిగా ఉన్నానని చెప్పారు.