ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్
NEWS Mar 25,2025 01:29 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. తనపై ఆనాడు పీడీ కేసు పెడతామంటే తమ పార్టీకి చెందిన వారే ఓకే అన్నారని సంచలన ఆరోపణలు చేశారు. నాకు వెన్ను పోటు పొడిచేందుకు సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా బీజేపీపై, నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.