Logo
Download our app
ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్
NEWS   Mar 25,2025 01:16 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఏప్రిల్ నెల మొద‌టి వారంలో డీఎస్సీ నోటిఫికేష‌న్ వేస్తామ‌ని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశామ‌న్నారు. నియామకాలు పారదర్శకంగా చేపట్టామ‌ని చెప్పారు . మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహిస్తామ‌న్నారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించే లోగా పోస్టింగులు ఇస్తామ‌న్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామ‌న్నారు. రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామ‌న్నారు. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source