కల్లు గీత కార్పొరేషన్ కు నీరా కేఫ్
NEWS Mar 25,2025 09:58 am
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఉన్న నీరా కేఫ్ ను కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందంటూ మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గీత కార్మికులు, గౌడన్నలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో సర్కార్ దిగి వచ్చింది. గత్యంతరం లేక తిరిగి కార్పొరేషన్ కు అప్పగించింది.