Logo
Download our app
ఢిల్లీ సెన్సేష‌న్ ల‌క్నో ప‌రేషాన్
NEWS   Mar 25,2025 08:58 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా విశాఖ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆ జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అశుతోష్ శ‌ర్మ‌. మ‌రో వైపు మార్ష్, పూర‌న్ లు చెల‌రేగి ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది. ఒకానొక ద‌శ‌లో అప‌జ‌యం త‌ప్ప‌ద‌ని అనుకున్న త‌రుణంలో సునామీలా వ‌చ్చాడు శ‌ర్మ‌. ల‌క్నో జెయింట్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. 135 ర‌న్స్ కే ఆరు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో మైదానంలోకి వ‌చ్చిన అశుతోష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. పిచ్చ కొట్టుడు కొట్టాడు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో గెలిపించాడు.
⚠️ You are not allowed to copy content or view source