సహాయక చర్యలు కొనసాగించాలి
NEWS Mar 24,2025 11:53 am
ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్ శాంతి కుమారికి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని సీఎంకు వివరించారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎక్స్పర్ట్ కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ లో ముందుకు వెళ్లాలన్నారు.