Logo
Download our app
సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ భూములు తీసుకోం
NEWS   Mar 25,2025 04:01 am
అసెంబ్లీ వేదిక‌గా మంత్రి శ్రీ‌ధర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క ఇంచును కూడా ఇప్పటి వరకూ టచ్ చేయ లేద‌న్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ దీనిపై ప్ర‌స్తావించారు. ఢిల్లీ నుంచి మార్గదర్శకాలతోనే కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. కేంద్ర యూనివ‌ర్శిటీ భూముల‌ను ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. ఇక హైడ్రా గురించి కూడా ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల‌ నుంచి 9078 ఫిర్యాదులు రాగా ఇందులో 7249 ఫిర్యాదులను పరిష్కరించామ‌న్నారు. 5 దశాబ్దాల నుంచి గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్లే హైడ్రా ఏర్పాటు చేయాల్సి వచ్చింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source