Logo
Download our app
అర్ధ‌రాత్రి దాకా హోట‌ళ్లు..రెస్టారెంట్లకు ఓకే
NEWS   Mar 24,2025 12:39 pm
ఏపీ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విజ‌య‌వాడ‌లో అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు రెస్టారెంట్లు, హోట‌ళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎస్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు, న‌గ‌ర పోలీస్ క‌మిష‌నర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు హోట‌ళ్లు, రెస్టారెంట్స్ య‌జ‌మానులు. గ‌తంలో కూడా ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక దానికి మంగ‌ళం పాడింది. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కార్ కొలువు తీర‌డంతో కొత్త‌గా తెరిచి ఉంచేందుకు ఆదేశాలు ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source