Logo
Download our app
ఇర్ఫాన్ ప‌ఠాన్ పై నిషేధం
NEWS   Mar 24,2025 09:26 am
భార‌త మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ పై వేటు ప‌డింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 కామెంటేట‌ర్స్ ప్యాన‌ల్ నుంచి తొల‌గించింది. గ‌త కొంత కాలంగా ప‌ఠాన్ వ్య‌క్తిగ‌తంగా క్రికెట‌ర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల భార‌త‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ల సంద‌ర్బంగా కొంద‌రు క్రికెట‌ర్ల‌ను ప‌నిగ‌ట్టుకుని దూషించాడ‌ని, అన‌వ‌స‌ర వ్యాఖ్య‌ల‌తో ఇబ్బంది పెట్టేలా చేశాడ‌ని ప్లేయ‌ర్లు పెద్ద ఎత్తున బీసీసీఐకి ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో త‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source