దక్షిణాది సీట్లు తగ్గకూడదు
NEWS Mar 24,2025 08:51 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డీలిమిటేషన్ పై తీవ్రంగా స్పందించారు. ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదని, అంత మాత్రానికే రాజకీయ పార్టీలు రాద్దాంతం చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏది ఏమైనా తాను బలవంతంగా ఏ భాషను ఇతర రాష్ట్రాలపై రుద్దాలని చూడాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. దక్షిణాది సీట్లు ఎంత మాత్రం తగ్గవన్నారు. ఈ అంశంపై తమ సర్కార్ పూర్తిగా క్లారిటీతో ఉందన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. కేంద్రానికి సహకరించాలని కోరారు.