Logo
Download our app
కేసీఆర్ దొంగ‌నోట్లు పంచాడు
NEWS   Mar 23,2025 03:26 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు మ‌హారాష్ట్ర లోని బీద‌ర్ లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందంటూ ఆరోపించారు. ఆ దొంగ నోట్ల‌ను ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ , లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశాడ‌ని అన్నారు. తాజాగా బండి సంజ‌య్ చేసిన కామెంట్స్ రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం బండి కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు. దీనిపై బీఆర్ఎస్ వ‌ర్గాలు ఇంకా స్పందించ లేదు.
⚠️ You are not allowed to copy content or view source