Logo
Download our app
బాల‌య్య‌..ప్ర‌భాస్..గోపిచంద్ పై ఫిర్యాదు
NEWS   Mar 23,2025 12:33 pm
బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 11 మంది యూట్యూబ‌ర్ల‌తో పాటు సినీ రంగానికి చెందిన న‌టులు క‌లిపి 25 మందిపై కేసులు న‌మోదు చేశారు. తాజాగా అగ్ర న‌టులు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్, గోపిచంద్ పై బెటింగ్ యాప్స్ కు మ‌ద్ద‌తు ఇస్తూ ప్ర‌మోష‌న్ చేస్తున్నారంటూ సిటీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు రామారావు అనే వ్య‌క్తి. ఫ‌న్ 88 బెట్టింగ్ యాప్ కు ఈ ముగ్గురు హీరోలు ప్ర‌మోష‌న్ చేశార‌ని ఆరోపించారు. వీరి కార‌ణంగా తాను డ‌బ్బులు పోగొట్టుకున్న‌ట్లు వాపోయాడు. దీంతో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం తెర పైకి వ‌చ్చింది.
⚠️ You are not allowed to copy content or view source