Logo
Download our app
మేక మాంసం అమ్మ‌కానికి భారీ డిమాండ్
NEWS   Mar 23,2025 10:07 am
ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఆదివారం మేక మాంసం విక్రయాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మేక మాంసం బొక్కలతో కిలోకు రూ 800, బొక్కలు లేకుండా రూ 1000, తలకాయ రూ 700, బోటి రూ 400, నల్ల కిలో రూ 100 గా మాంసం అమ్మకాలు జోరుగా జరిగాయి. జగిత్యాల జిల్లా లోనే మాంసం విక్రయ కేంద్రంగా పేరుగాంచిన రాజారాంపల్లిలో 16 దుకాణాలతో ప్రతి రోజూ 2 క్వింటాళ్ల రిటేయిల్ మాంసం విక్రయించారు. మేకల అమ్మకంలో కూడా ఈ ఊరుకి మంచి పేరుంది.
⚠️ You are not allowed to copy content or view source