Logo
Download our app
మాజీ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన కేటీఆర్
NEWS   Mar 23,2025 08:41 am
తెలంగాణ రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ కేఎల్ న‌ర‌సింహ‌న్ దంప‌తుల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాజీ మంత్రి కేటీఆర్. త‌మిళ‌నాడులో జ‌రిగిన డీ లిమిటేష‌న్ కీల‌క స‌మావేశంలో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి వివ‌రాల‌తో స‌హా వెల్ల‌డించారు. అనంత‌రం చెన్నైలో ఉన్న న‌ర‌సింహ‌న్ నివాసానికి వెళ్లారు . ఆయ‌న‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ,మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. ఈ సంద‌ర్బంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని నరసింహన్ దంపతులకు బ‌హూక‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source