Logo
Download our app
న‌కిలీ పురుగు మందుల విక్రేత‌ల అరెస్ట్
NEWS   Mar 23,2025 07:58 am
టాస్క్ ఫోర్స్ పోలీసులు జూలు విదిల్చారు. ప్ర‌ముఖ కంపెనీల పేర్ల‌తో న‌కిలీ పురుగు మందులు విక్ర‌యిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గ‌డువు తీరిన పురుగు మందులు త‌క్కువ ధ‌ర‌కు అంట‌గ‌డుతూ మోసానికి పాల్ప‌డుతున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితుల నుండి రూ. 78 ల‌క్ష‌ల 63 వేల రూపాయ‌ల విలువ క‌లిగిన, గ‌డువు తీరిన న‌కిలీ పురుగు మందులు, న‌కిలీ విత్త‌నాలు, మిష‌న‌రీ, ప్రింటింగ్ సామాగ్రి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source