Logo
Download our app
అద్దాల మేడ‌ల్లో ఉండ‌టం లేదు
NEWS   Mar 22,2025 04:35 pm
అసెంబ్లీలో నిప్పులు చెరిగారు మంత్రి సీత‌క్క‌. తాను ప్ర‌భుత్వం నిర్మించిన క్వార్ట‌ర్స్ లో ఉంటున్నాన‌ని అన్నారు. ఎవ‌రైనా రావ‌చ్చ‌ని, త‌మ ఇంట్లో భోజ‌నం చేసి పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. దివంగ‌త సీఎం వైఎస్సార్ హ‌యాంలో క‌ట్టించిన భ‌వ‌నంలో ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు. త‌న కుమారుడు కూడా హ‌న్మ‌కొండ‌లోనే ఉంటాడ‌ని చెప్పారు. త‌న గురించి ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. మీకు ఉన్న‌ట్లు త‌న‌కు వేల ఎక‌రాలు, కోట్లు విలువ చేసే భ‌వంతులు త‌న‌కు లేవ‌న్నారు సీత‌క్క‌.
⚠️ You are not allowed to copy content or view source