Logo
Download our app
గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు
NEWS   Mar 22,2025 02:28 pm
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఎస్సై అనిల్ కుమార్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. కోరుట్లకు చెందిన పోగుల అజయ్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ నుంచి కోరుట్లకు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అతని నుంచి 300 గ్రాముల గంజాయిని, ఒక ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source