Logo
Download our app
ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా
NEWS   Mar 22,2025 02:06 pm
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా హైద‌రాబాద్ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో మార్చి 23న ఆదివారం కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క పోరు కొన‌సాగ‌నుంది. ఈ మ్యాచ్ సంద‌ర్బంగా ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద బ్లాక్ లో టికెట్లు అందుతున్న భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టికెట్ల‌ను స్వాధీనం చేసుకుని ఉప్ప‌ల్ పోలీసుల‌కు అందించారు ఎస్ఓటీ టీం. దీనిపై ఇంకా వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్.
⚠️ You are not allowed to copy content or view source