Logo
Download our app
సీఎంను క‌లిసిన ఏఐజీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్
NEWS   Mar 22,2025 07:56 am
ఏపీ సీఎం చంద్ర‌బాబును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ఏఐజీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ జి. నాగేశ్వ‌ర్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన‌ట్లు తెలిపారు చంద్ర‌బాబు. ప్ర‌ధానంగా ఆరోగ్య సంరక్షణకు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెడ్ టెక్ పాత్రపై నాగేశ్వర్ రెడ్డితో చ‌ర్చించామ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు కావాల‌న్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే మోదీ ప్ర‌భుత్వం అత్యున్న‌త పౌర పుర‌స్కారం అంద‌జేసింది నాగేశ్వ‌ర్ రెడ్డికి.
⚠️ You are not allowed to copy content or view source