Logo
Download our app
పోలీస్ శాఖ‌పై హోం మంత్రి స‌మీక్ష
NEWS   Mar 21,2025 04:31 pm
రాష్ట్ర పోలీస్ శాఖ‌పై హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత సమీక్ష చేప‌ట్టారు. ఈ సమావేశానికి డీజీపీ హరీష్ గుప్తా, ఐజీ, డీఐజీ అధికారులు, జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు హాజ‌ర‌య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతిపై చర్చించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్ లో టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్, మాద‌క ద్ర‌వ్యాలపై ఉక్కు పాదం మోపాల‌న్నారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source