Logo
Download our app
బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ పై ఉక్కుపాదం
NEWS   Mar 21,2025 10:40 am
హైద‌రాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ పై పూర్తిగా ఉక్కుపాదం మోపుతామ‌ని స్ప‌ష్టం చేశారు మాదాపూర్ డీసీపీ వినీత్. బెట్టింగ్ యాప్స్ పై అన్ని వివరాలు సేకరిస్తున్నామ‌ని చెప్పారు. ముందు యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తామ‌న్నారు. వారి వివ‌ర‌ణ తీసుకున్నాక ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో.. లీగల్ పరిణామాలను పరిశీలిస్తున్నామ‌న్నారు. సామాజిక బాధ్యత లేకుండా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు డీసీపీ. స్టార్స్ తో యాడ్స్ చేసి.. వివిధ ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు.. వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వ్యక్తిగత అకౌంట్లలో ప్రమోట్ చేశారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source