Logo
Download our app
ఆటో నుండి కిందపడిన పదవ తరగతి విద్యార్థులు
NEWS   Mar 21,2025 10:31 am
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష రాసేందుకు వాజేడు మండలంలోని ధర్మవరంకు చెందిన పదవ తరగతి విద్యార్థులు శుక్రవారం ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ పరిమితికి మించి విద్యార్థులను తీసుకొని వస్తున్న క్రమంలో చీకుపల్లి ప్రధాన రహదారిపై హఠాత్తుగా కూర్చున్న ఇద్దరు విద్యార్థినిలు కిందపడి పోయారు. దీంతో పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source