Logo
Download our app
27 నుంచి కోదండ‌రాముడి ఉత్స‌వాలు
NEWS   Mar 21,2025 09:21 am
తిరుప‌తిలోని శ్రీ కోదండ రామ స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 27 నుంచి ప్రారంభం అవుతాయ‌ని వెల్ల‌డించారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. వ‌చ్చే నెల ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌య‌ని తెలిపారు. మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, 26న అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌న్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి, సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు తెలిపారు. వాహ‌న సేవ‌లు ప్ర‌తి రోజూ ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source