Logo
Download our app
ఆర్ఆర్ఆర్..బాహుబ‌లి సూప‌ర్
NEWS   Mar 20,2025 01:24 pm
రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌ర్యాట‌క రంగం అభివృద్దికి కృషి చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్, బాహుబ‌లి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. టాలీవుడ్ టాలెంట్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేసింద‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌పంచ అందాల పోటీలు ఇక్క‌డ నిర్వ‌హించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. సంవ‌త్స‌రానికి 300 సినిమాలు ఇక్క‌డ ప్రొడ్యూజ్ అవుతున్నాయ‌ని చెప్పారు. సిరాజ్, తిలక్ వర్మ, సానియా మీర్జా, పీవీ సింధు వంటి ఎందరో ప్రతిభావంతులు ఇక్క‌డి నుంచి వ‌చ్చార‌ని అన్నారు. 5 ఏళ్ల‌లో రూ. 15 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source