Logo
Download our app
23 నుంచి బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె
NEWS   Mar 20,2025 12:04 pm
దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు బ్యాంక‌ర్స్ యూనియ‌న్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాయి. 23 నుంచి మార్చి 25 అర్ద‌రాత్రి దాకా స‌మ్మె చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించాయి. ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది ప్రధాన బ్యాంకు సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలోని ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు, అధికారులు స‌మ్మెలో పాల్గొంటార‌ని తెలిపాయి.
⚠️ You are not allowed to copy content or view source