Logo
Download our app
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప‌రం చేసే కుట్ర
NEWS   Mar 20,2025 09:54 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేట్ ప‌రం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కుట్ర చేస్తోంద‌ని ఆరోపించారు. మోడీ త‌న స్నేహితుడు అదానీకి అప్ప‌గించేందుకు లోపాయికారిగా ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. కుట్ర‌కు మోడీ క‌ర్త అయితే ఖ‌ర్మ‌, క్రియ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు అంటూ ఫైర్ అయ్యారు. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు కానీ మ‌రో వైపు అమ్మే నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు లేదంటూ లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source