Logo
Download our app
తెలంగాణ నూత‌న బ‌డ్జెట్ అద్భుతం
NEWS   Mar 20,2025 09:26 am
కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లుర‌వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో త‌న సోద‌రుడు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ పెట్టిన తెలంగాణ బ‌డ్జెట్ 2025-26 అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఈ బ‌డ్జెట్ తెలంగాణ రాష్ట్ర రూపు రేఖ‌ల‌ను మార్చేస్తుంద‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11 వేల కోట్లను కేటాయించిందన్నారు. ప్రతి స్కూల్‌కు రూ.30 కోట్లు కేటాయించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇంత పెద్దఎత్తున గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగ లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source