Logo
Download our app
యాప్ సృష్టిక‌ర్త సిద్దార్థ్ కు సీఎం ప్ర‌శంస‌
NEWS   Mar 20,2025 08:38 am
గుండె జ‌బ్బుల‌ను గుర్తించేందుకు ఏఐ యాప్ ను క్రియేట్ చేశాడు సిద్దార్థ్ నంద్యాల‌. త‌ను అత్యంత పిన్న వ‌య‌సు. అత‌డు చేసిన కృషిని ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఇలాంటి ప్ర‌తిభ క‌లిగిన వారికి త‌మ స‌ర్కార్ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తుంద‌న్నారు. సెకన్లలో గుండె జబ్బులను గుర్తించేలా ఏఐ ఆధారిత యాప్ ను త‌యారు చేశాడు 14 ఏళ్ల సిద్దార్థ్. అమెరికా, భారతదేశంలో 15,000 మంది రోగులపై ఈ ఏఐ యాప్ ను ప‌రీక్షించారు. కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ 'సిర్కాడియావి'ని అభివృద్ధి చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source