Logo
Download our app
మార్చి 25 నుండి అన్న‌మ‌య్య వ‌ర్దంతి ఉత్స‌వాలు
NEWS   Mar 19,2025 04:41 pm
టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వ‌ర్థంతి ఉత్సవాలు మార్చి 25 నుండి 29వ తేదీ వరకు జ‌రుగుతాయ‌ని ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్నారు. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాక లోని ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో ఘనంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source