Logo
Download our app
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్స్ రిజ‌ల్ట్స్
NEWS   Mar 18,2025 07:44 pm
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు సంబంధించి తుది ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతిగృహాల్లో మొత్తం 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ప‌లితాలు ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు గాను గ‌త ఏడాది జూన్ 24 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్ నిర్వ‌హించింది. వీటి కోసం 82 వేల 873 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. క‌మిష‌న్ ఇప్ప‌టికే రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించింది. తాజాగా ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న అనంత‌రం ఫైన‌ల్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.
⚠️ You are not allowed to copy content or view source