Logo
Download our app
ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి దుర్మరణం
NEWS   Mar 18,2025 11:30 am
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్ (47) ఉపాధి నిమిత్తం ఇటలీ దేశానికి వెళ్లాడు. అక్కడ డ్రైవింగ్ పని చేస్తుండగా గత వారం జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. మృతునికి భార్య పిల్లలు, తల్లి, ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. కాగా రషీద్ కుటుంబం గత కొన్నేళ్లుగా సిద్దిపేటలో నివాసముంటున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం బుధవారం భారత్‌కు తీసుకొస్తునున్నట్లు తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source