Logo
Download our app
రూ. 7,100 కోట్ల‌తో డీపీఆర్ సిద్దం
NEWS   Mar 18,2025 03:24 pm
శాస‌న స‌భ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.7,100 కోట్లతో టెండర్లు పిలిచామ‌ని చెప్పారు. రెండు నెలల్లో కేంద్రం అనుమతి ఇప్పించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి డీపీఆర్ సిద్ధం చేయాలని గడ్కరీ కోరారని అన్నారు. మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని స్ప‌ష్టం చేశామ‌న్నారు.. డీపీఆర్ తయారు చేసేందుకు ఏజెన్సీల ఎంపిక కూడా జ‌రిగింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source