Logo
Download our app
విశాఖ ఐపీఎల్ మ్యాచ్ కు నిరాద‌ర‌ణ
NEWS   Mar 18,2025 03:06 pm
మార్చి 22 నుంచి ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఓ వైపు ఉప్ప‌ల్ లో జ‌రిగే ఎస్ఆర్ హెచ్, ఆర్ఆర్ మ్యాచ్ కు పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడు పోగా విశాఖ‌లో మాత్రం అందుకు భిన్నంగా ఇంకా టికెట్లు సేల్ కాలేదు. ఆన్ లైన్ లో అమ్మ‌కానికి పెట్టినా ఎవ‌రూ అంత‌గా ఆస‌క్తి చూప‌క పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఈనెల 24న ల‌క్నో తో ఢిల్లీ త‌ల‌ప‌డ‌నుంది. స‌రైన స‌మాచారం లేక పోవ‌డం, నిర్వ‌హ‌ణ లోపంతో టికెట్లు అమ్ముడు పోవ‌డం లేదు. ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీం విశాఖ‌కు చేరుకుంది.
⚠️ You are not allowed to copy content or view source